loading...
ఇంగ్లండ్ తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ లో తొలి రెండు టెస్టులకుగానూ భారత జట్టును ఎంపిక చేశారు. గాయం కారణంగా ఈ టెస్ట్ సిరీస్ కు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ దూరమయ్యారు. తొలిసారి హార్ధిక్ పాండ్యా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత్ ఈ సిరీస్ లో ఇంగ్లండ్ తో తలపడనుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధికారులు, సెలక్షన్ ప్యానల్ సభ్యులు సుదీర్ఘంగా చర్చించి మొదటి రెండు టెస్టులకుగానూ ఆటగాళ్ల జాబితాను విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి రాజ్ కోట్ లో భారత్-ఇంగ్లండ్ ల మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది.
టీమిండియా టెస్టు జట్టు:
విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్, మురళీ విజయ్, చతేశ్వర్ పుజారా, వృద్ధిమాన్ సాహా, హార్ధిక్ పాండ్యా, అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, కరుణ్ నాయర్, అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, మహ్మద్ షమీ, జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్

No comments:
Post a Comment