Latest News

Vijayashanti Personal Interview

loading...

హైదరాబాద్: నేడు పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్ననటి,మాజీ ఎంపీ  విజయశాంతి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. హీరోలకు దీటుగా రాణించి హీరోయిన్‌కి ప్రత్యేకమైన హోదా తీసుకొచ్చిన ఘనత విజయశాంతిదే అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. దాదాపు మూడు దశాబ్దాల పాటు తిరుగులేని కథానాయికగా ప్రేక్షకుల మన్ననలు పొంది 'ఒసేరు రాములమ్మ'గా సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసుకుంది. నటిగా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా తానేమిటో నిరూపించుకున్న విజయశాంతి ఆమెకి చిన్నప్పుడు ట్యూషన్లు, క్లాస్‌, క్లాసికల్‌ డాన్స్‌ తప్ప మరేది తెలిసేది కాదు. ఆ క్రమశిక్షణ ఆమెకి ఉపయోగపడింది. ఒకవేళ స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఆమె జీవితం మరోలా ఉండేదేమో. అలా పెరగబట్టే జీవితం విలువేంటో తెలిసింది. నాన్నగారు చనిపోయినప్పుడు ఆమెకి ఏమీ తెలియదు. వాళ్ల అమ్మా హార్ట్‌ పేషెండ్‌. తను కూడా కొన్ని రోజులకే చనిపోయింది. ఆ టైమ్‌లో ఏం చేయాలో తోచేది కాదు ఆంట. చావలేం, బతకలేం అన్నట్టుగా సాగింది. బతకాలంటే పనిచేయాలనిపించింది. ఇప్పుడింత స్ట్రాంగ్‌గా ఉన్నది అంటే బహుశా అలాంటి పరిస్థితుల వల్లే అనిపిస్తుంది.

విజయశాంతి చిన్నవయసులోనే సినీ రంగంలోకి అడుగు పెట్టి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు. కెరీర్‌ తొలినాళ్ళలో సున్నితమైన పాత్రలు చేసేది. ఆ తర్వాత చాలా శక్తివంతమైన పాత్రలు చేసింది అంటే ఆమెకే ఆశ్చర్యంగా ఉండేది ఆంట. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేసిన తర్వాత చాలా స్ట్రాంగ్‌ మారింది అంత. అలా మారిన తర్వాతే ఆమె కెరియర్ చాలా బాగుంది ఆంట. మహిళలు సాఫ్ట్‌గా ఉండకూడదని అప్పుడర్థమైంది. ఏ రంగంలోనైనా మగవాళ్లు ఆడవాళ్ళను దాదాపుగా తొక్కేస్తారు. సినీ రంగంలో హీరోయిన్లను తక్కువ చేసి మాట్లాడేవారు. అప్పుడు చాలా బాధేసేది ఆంట. అప్పట్నుంచి ఆమె ఆలోచన విధానం మారింది. అందుకే 'కర్తవ్యం' లాంటి సినిమా చేయాలి అనుకుంది ఆంట. ఆ ప్రయోగం సక్సెస్‌ కావడం 'లేడీ అమితాబ్‌' అని పేరు రావడం జరిగింది. 1990లో అత్యధిక పారితోషికం తీసుకున్న కథానాయికను ఆమె ఆంట. ఆమె అప్పట్లో రెమ్యూనరేషన్‌ కోటి రూపాయలు. చిరంజీవి, బాలకృష్ణల కన్నా ఆమె పారితోషికం ఎక్కువ. ఓ ప్రముఖ పత్రిక అప్పట్లో రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌, విజయశాంతి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తారలని రాయడం గొప్ప ఎచీవ్‌మెంట్‌.

ఆమె దాదాపు 28ఏండ్లు సినీ రంగంలో ఉంది. ఆమెకి తెలిసి ప్రపంచంలో ఏ హీరోయిన్‌కి ఇంత లాంగ్‌ కెరీర్‌ లేదు. ఆమె 25ఏండ్లని టార్గెట్‌ చేసింది అంటే ఆమెకు ఉన్న ఓపిక, సహనం, మొండితనం, పట్టుదల, కమిట్‌మెంట్‌ ఉండబట్టే ఇన్ని సంవత్సరాలు రాణించగలిగానని నమ్ముతుంది. ఆమె కాళ్ల మీద ఆమె నిలబడాలన్నది తన సిద్ధాంతం. అది సాధించింది. 28ఏండ్లు సినీ జీవితంలో ఉండడంతో రాజకీయాల్లోకి వచ్చాక మళ్ళీ సినిమాలు చేయాలనే ఆసక్తి తగ్గిపోయింది ఆంట. అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నా. 'రుద్రమదేవి' చిత్రంతో మళ్ళీ తెరపైకి రావాలని అనుకుంది ఆంట. తెలంగాణ ఉద్యమం తీవ్రమయ్యేసరికి సినిమా ఆలోచన వదిలేసి. అదే టైమ్‌లో 'రుద్రమదేవి' పేరు తో మరో సినిమా ప్రారంభమైంది. అందుకే ఆ సినిమా ని ఆమె దాన్ని వదలి పెట్టింది ఆంట.

ఆమెకి రాజకీయాలు అంటే మురికి కాలువ అని తెలుసు. కానీ దిగాల్సి వస్తుందనుకోలేదు ఆంట.  కానీ ఎలాగో అలా దిగింది కాబట్టి ఇప్పుడు ఇవే గంగా, యమున, సరస్వతి అనుకుంటున్నారు ఆంట. అయితే రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ సినిమాల ప్రభావం ఆమెపై చాలా ఉంది. 'ప్రతిఘటన', 'కర్తవ్యం', 'ఓసేరు రాములమ్మ' వంటి సినిమాలన్నీ చాలా డైనమిక్‌గా ఉంటాయి. రాజకీయాల్లో కూడా డైనమిక్‌గా ఉండడంతో అందరు ఆమెని 'రాములమ్మ' అని పిలిచేవారు.

వ్యక్తిగత విషయానికి వస్తే.. విజయశాంతికి ఆర్బాటాలు నచ్చవు అని. గ్రాండ్‌గా పెళ్ళిళ్లు చేసుకుని, విడాకులు తీసుకున్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పైగా సినిమా హీరోయిన్ల జీవితాలు అంటే దాదాపు ట్రాజెడీనే. అలా చాలా మంది జీవితాలు చితికిపోయాయి. అందుకే ఆర్బాటం వద్దు అనుకోని. శ్రీనివాస్‌ ప్రసాద్‌తో తన చాలా పెళ్ళి సింపుల్‌గానే జరిగింది. సింపుల్‌గా బతకడమంటేనే తనకు చాలా ఇష్టం. అందుకే బయట ఎక్కువ కనిపించదు. ఇప్పటి వరకు ఆమె లైఫ్‌ని చూసుకుంటే జీవితంలో పెద్ద పీహెచ్‌డీ చేసినంతగా ఉంటది ఆంట. వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు. వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్తాం అని తన కన్న బిడ్డలు రేపు మంచి చేస్తారని గ్యారంటీ లేదు. అందుకే పిల్లలు వద్దు అనుకున్నారు అంత. ప్రజలే పిల్లలు అని. తన జీవితం ప్రజలకే అంకితం చేసింది అంత. వాళ్ల కోసమే బతుకుతా అని. వాళ్ళ కోసమే చచ్చిపోతా అని చెప్పింది.

No comments:

Post a Comment

Video Talkies Web Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.